‘సిరిసిల్ల’ వస్త్ర పరిశ్రమ మూత – రోడ్డున పడనున్న కార్మికులు

sircilla textile park closed in telangana

తెలంగాణ : 25,000 కంటే ఎక్కువ మగ్గాలున్న సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ నేటి నుండి నిరవధికంగా మూతపడింది. ఈ నిర్ణయంతో వేలాది మంది పవర్లూమ్, చేనేత కార్మికులు ఉపాధి కోల్పోనున్నారు. దేశవ్యాప్తంగా టెక్స్‌టైల్ పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం, కొత్త ఆర్డర్లు లేకపోవడం, పెరిగిన విద్యుత్ ఛార్జీలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరిశ్రమ యాజమాన్యాలు తెలిపారు. గతంలో ఉత్పత్తి చేసిన వస్త్రాల తాలూకు బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేదని వారు వాపోయారు. గోడౌన్లలో ఇప్పటికే లక్షల మీటర్ల వస్త్రం పేరుకుపోయిందని, పాలిస్టర్ యజమానులు కొత్త నూలు కొనుగోలు చేసి ఉత్పత్తి కొనసాగించే పరిస్థితి లేదని నేతన్నలు వెల్లడించారు. సిరిసిల్ల పవర్లూమ్ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వులు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు ప్రకటించారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని పరిశ్రమల యాజమాన్యాలు తెలిపాయి.

➡️