- లేబర్ అధికారుల సమక్షంలో చర్చలు
ప్రజాశక్తి-గ్రేటర్ విశాఖబ్యూరో : వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తున్న యాజమాన్య చర్యలకు నిరసనగా ఈ నెల 16న తలపెట్టిన కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె మే 20వ తేదీ నాటికి వాయిదా పడింది. విశాఖలో లేబర్ అధికారుల సమక్షంలో మంగళవారం సాయంత్రం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు యాజమాన్య ప్రతినిధులు, అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘల నాయకుల మధ్య చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా యాజమాన్య ప్రతినిధులు హామీ ఇస్తూ బుధవారం నుంచి మే 20 వరకు కొత్తగా కాంట్రాక్ట్ కార్మికులు ఎవరినీ తొలగిచబోమని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు తొలగించిన కాంట్రాక్ట్ కార్మికుల విషయంలోనూ మరోసారి చర్చలు జరుపుతామని తెలిపారు. దీంతో కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు నిరవదిక సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.