ప్రజాశక్తి-అమరావతి : వైసిపి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి మద్యం కేసులో విచారణకు హాజరు కావాలంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది. విజయవాడలో ఉన్న సిట్ కార్యాలయానికి ఈనెల 18వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో విచారణకు రావాలని కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి మూడు సార్లు సిట్ నోటీసులు జారీ చేసినా.. ఆయన విచారణకు హాజరు కాలేదు.. తాజాగా విజయసాయి రెడ్డికి సిట్ నోటీసులు జారీచేయటం చర్చనీయాంశంగా మారింది.
