2019-24 మధ్య మద్యం అమ్మకాలపై సిట్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : 2019-24 మార్చి వరకు జరిగిన మద్యం అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను నియమించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనాశాఖ జిఓ ఆర్‌టి నెంబరు 262ను బుధవారం విడుదల చేసింది. సిట్‌కు విజయవాడ పోలీస్‌ కమిషనరు రాజశేఖర్‌బాబు ఆధ్వర్యాన ఏడుగురు సభ్యులను కేటాయించారు. మద్యం అమ్మకాలకు సంబంధించి సిట్‌కు అవసరమైన పూర్తి సమాచారం ఇవ్వాలని ఎక్సైజ్‌శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. దర్యాప్తు బృందం ప్రతి 15 రోజులకోసారి సిఐడి చీఫ్‌ ద్వారా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని జిఓలో స్పష్టం చేశారు.

➡️