గ్యాంగ్‌టక్: సిక్కింలో బస్సు నదిలో పడి ఆరుగురు చనిపోయారు. శుక్రవారం సాయంత్రం బస్సు సిలిగురి నుంచి గ్యాంగ్‌టక్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే చనిఓయారు. గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బ్రేక్ ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు.