సూర్యపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Apr 25,2024 06:26 #6 death, #road acident

సూర్యపేట : సూర్యపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగిఉన్న లారీని వెనక నుంచి కారు ఢీకొట్టడంతో ఓ చిన్నారితో సహా ఆరుగురు చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.  హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ఘటన చోటుు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన ఇద్దరిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృత దేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమర్టంకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

➡️