Skill case : చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. సిఐడి తరపున వాదనలు వినిపించేందుకు నేరుగా కోర్టుకు హాజరయ్యేందుకు కొంత సమయం ఇవ్వాలని సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ కోరారు. దీంతో ధర్మాసనం విచారణను జనవరి రెండో వారానికి వాయిదా వేసింది.

➡️