సామాజిక సమస్యలు పరిష్కరించాల్సిందే

Apr 11,2025 20:28 #aidwa, #AIDWA AP

 ‘అనంత’లో సామాజిక చైతన్య యాత్ర ప్రారంభం
ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : సామాజిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కెవిపిఎస్‌, ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ సంఘాల ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో చేపట్టిన సామాజిక చైతన్య యాత్ర శుక్రవారం ప్రారంభం అయ్యింది. అనంతపురం జడ్‌పి కార్యాలయం ఆవరణంలో జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యాత్రను ఐద్వా నాయకులు డాక్టర్‌ ప్రసూన జెండా ఊపి ప్రారంభించారు. మొదటి రోజు బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, తాడిపత్రి, యాడికి మండలాల్లో యాత్ర సాగింది. ఈ సందర్భంగా ప్రసూన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా యాత్ర బృందం పర్యటించి సామాజిక సమస్యలను అధ్యయనం చేసి.. వారు పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేయనుందని తెలిపారు. కెవిపిఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఒ.నల్లప్ప మట్లాడుతూ ఇప్పటికీ అనేక దళితవాడల్లో కనీస సదుపాయాలకు నోచుకోవడం లేదని అన్నారు. ఎవరైనా చనిపోతే ఖననం చేయడానికి శ్మశానవాటికల్లేని దుస్థితి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి సావిత్రి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఓతూరు పరమేష్‌, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి వెంకటేశ్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సూరి తదితరులు పాల్గన్నారు.

➡️