హైదరాబాద్ : హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వంగ నవీన్ రెడ్డి(24) ఆత్మహత్య చేసుకున్నాడు. మైండ్ స్పేస్ టవర్ లో 13వ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నవీన్ ఎన్సీఆర్ యోయిస్ కంపెనీలో పని చేస్తున్నట్టు తెలుస్తోంది. అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
