పనిఒత్తిడి.. 32 అంతస్తుల భవనం పైనుంచి దూకి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

రంగారెడ్డి (తెలంగాణ) : ఉద్యోగంలో పని ఒత్తిడి కారణంగా మనస్తాపం చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి 32 అంతస్తుల భవనం పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లోని ఇన్‌స్పెక్టర్‌ హరికృష్ణారెడ్డి, స్థానికుల వివరాల మేరకు …. ఢిల్లీకి చెందిన అమన్‌ జైన్‌ (32) అమెజాన్‌ లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి మైహౌం టర్క్‌ క్షియా టవర్‌ వన్‌ లో నివాసం ఉంటున్నారు. భవనం 32వ అంతస్తుకు చేరుకున్న అమన్‌ జైన్‌ ఒక్కసారిగా అక్కడ నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో తీవ్రగాయాలతో అమన్‌ జైన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఉద్యోగంలో ప్రమోషన్‌ రావడం లేదని, పని ఒత్తిడి కూడా బాగా పెరిగిందని కుటుంబ సభ్యులతో చెప్పేవాడని తెలుస్తుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై కుంగుబాటుకు చికిత్స కూడా తీసుకుంటున్నాడని కుటుంబీకులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️