ఆస్తి విషయమై తల్లిని చంపిన కుమారుడు

Apr 2,2024 21:48 #crime

– పరారీలో నిందితులు
ప్రజాశక్తి – పిచ్చాటూరు (తిరుపతి జిల్లా) :ఆస్తి విషయమై కన్నతల్లిని గొంతుకోసి హతమార్చాడు ఓ కాసాయి కుమారుడు. ఈ ఘటన తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం అడవి కొడియంబేడు గ్రామంలో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం..రాజమ్మ(80)కు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె పేరు మీద 1.47 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. చిన్న కుమారుడైన కృష్ణారెడ్డికి 40 సెంట్లు, మిగిలిన భూమిని, తల్లి భాగము కలిపి పెద్దకుమారుడి కొడుకైన హరిరెడ్డి పేరుమీద 1.07 ఎకరాలు రిజిస్ట్రేషన్‌ చేశారు. తల్లి భాగంలో తనకు వాటా కావాలని మూడు నెలలుగా చిన్న కుమారుడు గొడవపడుతున్నాడు. ఈ నేపథ్యంలో రాజమ్మ, పెద్ద కొడుకు కుమారుడు హరిరెడ్డి మంగళవారం కృష్ణారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కృష్ణారెడ్డి, అతని కుటుంబసభ్యులు రాజమ్మతో గొడవకు దిగారు. కిరాతకంగా గొంతుకోసి, అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. సిఐ భాస్కర్‌నాయక్‌ మాట్లాడుతూ.. రాజమ్మను హత్య చేసిన ముద్దాయిలు చిన్న కుమారుడు కృష్ణారెడ్డి, కోడలు గౌరీ, మనవళ్లు ఇలంగో, పురుషోత్తంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

➡️