ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటేడ్(ఎపిఎస్‌పిడిసిఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్(సిఎండి) కె సంతోష్‌రావు పదవి కాలాన్ని రాష్ట్రప్రభుత్వం పొడిగించింది. ఇందుకు సంబంధించిన జివో 29ను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ శనివారం విడుదల చేశారు. సంతోష్‌రావును 2023 ఏప్రిల్ 14వ తేదిన ఎస్‌పిడిసిఎల్ సిఎండిగా నియమించిన ప్రభుత్వం రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారని వెల్లడించింది. ఇప్పుడు కొత్తవారిని నియమించే వరకు ఆయననే కొనసాగిస్తూ తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది.
