జులై 29, ఆగస్టు 3న ప్రత్యేక లోక్‌ అదాలత్‌

Jun 10,2024 21:28 #lok adalat, #supreem court

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారం కోసం జులై 29, ఆగస్టు 3న ప్రత్యేక లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు ఎపి రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎం బబిత తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సంబంధిత జిల్లా లేదా రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థలు ఫిజికల్‌/వర్చువల్‌ విధానంలో ముందస్తుగా లోక్‌ అదాలత్‌ సమావేశాల్లో పాల్గొని కేసుల్లో రాజీ కుదుర్చుకునేందుకు కక్షిదారులకు వీలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అదనపు సమాచారం కోసం కక్షిదారులు లేదా వారి న్యాయవాదులు టోల్‌ ఫ్రీ నెంబరు 15100కు లేదా వారి సమీప కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవాధికార సంస్థను సంప్రదించవచ్చన్నారు. లోక్‌ అదాలత్‌ ద్వారా కేసుల పరిష్కారానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు.

➡️