Special Trains – దసరా వేళ – నేటి నుండి విజయవాడ-శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లు

విజయవాడ : దసరా వేళ ప్రయాణాల సౌలభ్యం కోసం దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో విజయవాడ-శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లను అధికారులు ప్రకటించారు. అక్టోబర్‌ 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. దసరా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా విజయవాడ-శ్రీకాకుళం రోడ్‌ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. విజయవాడ నుంచి శ్రీకాకుళం రోడ్డు వరకు ప్రతి రోజు రాత్రి 8 గంటలకు నంబర్‌ 07215 ప్రత్యేక రైలు బయలుదేరుతుంది. విజయవాడ నుంచి బయలుదేరే రైలు శ్రీకాకుళం రోడ్‌ స్టేషన్‌కు ఉదయం ఐదున్నర గంటలకు చేరుకుంటుంది. అక్టోబర్‌ 9, 10, 11, 12, 14, 15, 16, 17 తేదీల్లో ఈ ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. తిరుగు ప్రయాణంలో నంబర్‌ 07216తో శ్రీకాకుళం రోడ్‌ – విజయవాడ ప్రత్యేక రైలుట శ్రీకాకుళంలో ఉదయం ఆరున్నర గంటలకు బయలుదేరి సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. ఈ రైలు అక్టోబర్‌ 10, 11, 12, 13, 15, 16, 17, 18 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. విజయవాడ – శ్రీకాకుళం రోడ్డు ప్రత్యేక రైలు విజయవాడ నుంచి బయలుదేరి ఏలూరు, తాడేపల్లి గూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారకపూడి, అనపర్తి, సామర్లకోట, అన్నవరం తుని, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైల్లో ఏసీ త్రీ టైర్‌, స్లీపర్‌ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల రద్దీ కారణంగా ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్‌ అధికారులు ప్రకటించారు.

➡️