ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో ముగింపులో భాగంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్టు మంత్రి ఎం.రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మంగళవారం బహుమతులు , క్రీడా సామాగ్రిని పరిశీలించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి రాంప్రసాద్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో పరిశీలించారు. ఈ పోటీలపై స్పీకర్ అధికారులు, చీఫ్ విప్‌లతో సమావేశం నిర్వహించారు. 18వ తేదీ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభం కానుంది. విజేతలకు ప్రైజులు, మెమెంటోలు అందజేయడం, క్రీడల్లో పాల్గొనే వారికి గాను ప్రత్యేక డ్రెస్సు శాప్ చైర్మన్ రవి నాయుడుకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాలు రాజకీయ నాయకులకు రిలీఫ్ కలిగించేలా నిర్వహించాలని, ఇంకా వివిధ సాంస్కతిక కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు. శాసనసభ్యులు, మండలి సభ్యులు అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. మార్చి 20న రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బహుమతి ప్రదానోత్సవం నిర్వహించనున్నారు. మండలిలో చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, శాసనసభలో విప్ గణబాబు,శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి,సుందరపు విజరు కుమార్ పాల్గొన్నారు.
