రేపు కెయులో స్పాట్‌ అడ్మిషన్లు

  • బిటెక్‌, ఎంటెక్‌ పిజి కోర్స్‌ల్లో ఖాళీల భర్తీ

ప్రజాశక్తి-మచిలీపట్నం రూరల్‌ : కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ, నూజివీడు ఎంఆర్‌ఎఆర్‌ కాలేజీ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ స్టడీస్‌లో పిజి సీట్లతోపాటు కెయు ఇంజనీరింగ్‌ కళాశాలలో బిటెక్‌, ఎంటెక్‌ కోర్స్‌లలో సీట్ల భర్తీకి ఈ నెల 28న స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ డాక్టర్‌ ఎల్‌ సుశీల శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయ పరిపాలనా భవనంలో ఉదయం 10 గంటల నుండి ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. వెయ్యి రూపాయిలు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించి పాల్గొనాలని సూచించారు. పిజి ర్యాంక్‌ కార్డుతోపాటు సంబంధిత అన్ని ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని తెలిపారు. బిటెక్‌లో చేరే విద్యార్థులు ఎపిఇఎపి ర్యాంక్‌ తీసుకురావాలని కోరారు. ఎంఎ ఇంగ్లీష్‌, ఫిజిక్స్‌, గణిత శాస్త్రం, బయోటెక్నాలజీ, రసాయన శాస్త్రం, బోటని, జువాలజీ, ఎంకమ్‌ బిటెక్‌, ఎంటెక్‌, ఎంఎస్‌సి అప్లైడ్‌ కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, స్టాస్టిక్స్‌, అప్లైడ్‌ గణిత శాస్త్రం విభాగాలలో సీట్లు భర్తీ చేస్తామని తెలిపారు.

➡️