ప్రజాశక్తి – తిరుమల : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజైన శుక్రవారం ఉదయం 7 గంటలకు ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో యాత్రికులు పాల్గని స్వామివారి రథాన్ని లాగారు. తిరుమాడ వీథులలో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. వాహనసేవలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్‌స్వామి, టిటిడి ఇఒ జె శ్యామల రావు, అదనపు ఇఒ సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఇఒలు గౌతమి, వీరబ్రహ్మం, సివిఎస్‌ఒ శ్రీధర్ తదితరులు పాల్గన్నారు.