ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీధర్‌ బాబు

Dec 14,2023 11:19 #it minister, #Telangana

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా శ్రీధర్‌ బాబు గురువారం ఉదయం తనకు కేటాయించిన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. శ్రీధర్‌ బాబు బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్‌, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, రాజ్‌ ఠాకూర్‌ మక్కాన్సింగ్‌, గండ్ర సత్యనారాయణ శ్రీధర్‌ బాబును కలిశారు. అలాగే మంథని నియోజకవర్గంతో పాటు కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు శ్రీధర్‌బాబును కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

➡️