- వైవియు వైస్‌ఛాన్సలర్ కృష్ణారెడ్డి
ప్రజాశక్తి- కడప అర్బన్ : ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు కె.శ్రీనివాస్‌కు, ప్రజాశక్తి పూర్వ సంపాదకులు తెలకపల్లి రవికి గజ్జల మల్లారెడ్డి జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేయనున్నట్లు యోగి వేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె.కృష్ణారెడ్డి తెలిపారు. యోగి వేమన విశ్వవిద్యాలయంలో జరిగిన ప్రముఖ రచయిత, సాహిత్యవేత్త గజ్జల మల్లారెడ్డి జీవన సాఫల్య పురస్కార ఎంపిక కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా వీరికి పురస్కారాలు ప్రదానం చేయనున్నట్టు వివరించారు. సమకాలీన పరిస్థితులను అర్థం చేసుకుని సమాజానికి ఉపయోగపడే రచనలు చేయడంలో కె.శ్రీనివాస్, తెలకపల్లి రవి తమదైన శైలిలో ముందున్నారని పేర్కొన్నారు. ప్రజాపక్షం వహించి సంపాదకీయాలు రాయడంలోనూ, సాహిత్య రచనలు చేయడంలోనూ వీరి ఇరువురూ ప్రజాస్వామ్య పద్ధతులను అవలంభించారని తెలిపారు. డిసెంబర్‌లో అవార్డులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.