- సూర్య, చంద్రప్రభ వాహనంపై బద్రి నారాయణుడు
ప్రజాశక్తి -తిరుమల : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఏడోరోజు గురువారం ఉదయం సూర్య ప్రభ వాహనంపై బద్రినారాయణుడి అలంకారంలో, సాయంకాలం చంద్రప్రభ వాహనంపై కృష్ణుడి అలంకారంలో మాడవీధుల్లో శ్రీవారిని ఊరేగించారు. వాహనం ముందు భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి. యాత్రికులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించారు. వాహన సేవలో తిరుమల పెద్దజీయర్, చిన్నజీయర్, టిటిడి ఇఒ జె.శ్యామల రావు దంపతులు, అదనపు ఇఒ సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఇఒలు గౌతమి తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం ఏడు గంటలకు స్వామివారి రథోత్సవం నిర్వహించనున్నారు.