24న ఎస్‌ఎస్‌సి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష :  దేవానందరెడ్డి

May 14,2024 22:30 #10th examination, #supply

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎస్‌ఎస్‌సి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఈ నెల 24న ఉదయం 9:30 నుంచి 12:45 గంటలకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టరు డి దేవానందరెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. 2024 మార్చిలో ఎస్‌ఎస్‌సి పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిలైన అభ్యర్థులందరి హాల్‌ టికెట్లను షషష.bరవ.aజూ.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. విద్యార్థి పేరు, పుట్టిన తేదీని ఎంచుకోవడం ద్వారా వారి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.

➡️