వక్స్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర సదస్సు

ప్రజాశక్తి-గుంటూరు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్స్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ ఆవాజ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 18న(ఆదివారం) గుంటూరులోని గుఱ్ఱం జాషువా విజ్ఞాన కేంద్రంలో ఉదయం 10 గంటలకు రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నారు. ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షులు యస్.ఎ. సుభాన్ సభాధ్యక్షులు వ్యవహరిస్తున్న ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా సీనియర్ అడ్వకేట్ జాహఆరా, ఏ.పి హైకోర్టు అడ్వకేట్ బి. శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ  లక్ష్మణరావు, ముస్లిం అడ్వకేట్స్ అసోసియేషన్ ఎ.పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ మతీన్ లు పాల్గొనున్నారు. ఈ సందర్భంగా తీర్మానంను  ఆవాజ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి యం.ఎ.చిష్టి  ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా వారు ప్రచార పత్రాన్ని విడుదల చేశారు. బిజెపి మూడవసారి అధికరంలోకి వచ్చిన తరువాత ముస్లిం మైనార్టీలపై దాడులు కొనసాగిస్తుందన్నారు. అందులో భాగంగా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం వక్స్ చట్టాన్ని సవరిస్తూ 40 ప్రతిపాదనలు పెట్టినదన్నారు.. ఈ చట్ట సవరణ చాలా దుర్మార్గమైనదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 9.4 లక్షలఎకరాలు భూములు కలిగిన మూడవ అతి పెద్ద సంస్థగా వర్ఫ్ బోర్డు ఉన్నదన్నారు.. ముస్లిం మైనార్టీలభాష, సాంస్కృతిక, ఆర్థిక, విద్య, ఉపాధి, సామాజిక అభివృద్ధి భావితరాల భవిష్యత్తు ను దృష్టిలో ఉంచుకొని ధార్మిక కార్యక్రమాల కోసం దూర దృష్టితో పూర్వీకులు తమ ఆస్తులను భూములను వక్స్ చేశారన్నారు. ఈ భూములను రక్షించి మైనార్టిలను అన్ని రంగాలలో అభివృద్ధి చేందాలనే ఉద్దేశంతో వక్స్ చేయబడ్డాయో ఆ ఉద్దేశాన్ని నిర్వర్తించడంలో ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే విస్మరించాయన్నారు. వక్స్ ఆస్తులను కాపాడవలసిన వారే అక్రమాలకు, కబ్జాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బిల్లు సవరణ పేరుతో అన్యమతస్తులను వర్ఫ్ బోర్డులో పెట్టడం వల్ల వక్స్ లక్ష్యాలను తూట్లు పొడవడమే అవుతుందన్నారు.

కేంద్ర ప్రభుత్వానికి ముస్లింల అభివృద్ధి పట్ల గాని, వక్స్ ఆస్తులరక్షణ పట్ల గాని చిత్తశుద్ధి లేదన్నారు. ఉంటే రంగనాథ్ మిశ్రా సిఫార్సులు, సచార్ కమిటీ నివేదికలు ముస్లింల అభివృద్ధికై చేసిన సూచనలు ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాల్సి ఉందన్నారు. బిజెపి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుండి ముస్లిం మైనార్టీలపై అనేక పేర్లతో దాడులు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నదన్నారు. వక్స్ చట్ట సవరణ ద్వారా ముస్లిం మైనార్టీలకు వక్స్ ఆస్తులపైన ఎలాంటి హక్కు లేకుండా చేస్తుందన్నారు. దర్గాలు, మసీదులు , పీర్ల సావడి తదితర వాటిపై వారసులకు నిర్వహణ కమిటీలకు ఎలాంటి హక్కు లేకుండా వారి నుండి వక్స్ ఆస్తులను లాగేసుకోవడం కోసం చేస్తున్న చట్టం తప్ప మరొకటి కాదు, ఈ బిల్లును పార్లమెంట్లో యన్.డి.ఎ. పక్షంలోని టి.డి.పి., జనసేన పార్టీలు సమర్ధించడం చాలా దురదృష్టకరమన్నారు. ఇండియా వేదిక లోని కాంగ్రేస్, వామపక్ష పార్టీలు వ్యతిరేకించాయన్నారు. ఈ బిల్లు జాయింట్ పార్లమెంట్ కమిటికి పంపించినప్పటికి ఇంకా ప్రమాదం పొంచే ఉందన్నారు.

ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా 70 వేలఎకరాలవక్స్ భూములు ఉన్నవి. 31 వేల594 ఎకరాలు కబ్జా అయ్యాయని తెలిపారు. చట్టాల మార్పు పేరుతో, కబ్జాలతో ముస్లింల అభివృద్ధికై వక్స్ చేయబడ్డ ఆస్తులు భూములు కనుమరుగు అయ్యే పరిస్థితి కనిపిస్తుందన్నారు. వక్స్ ఆస్తులు, భూములపై వస్తున్న ఆదాయం లో ప్రథమ భాగం ముస్లిం మైనార్టీలకోసం ఖర్చుపెట్టినా ప్రభుత్వాలు ఇచ్చే ఎటువంటి సంక్షేమ పథకాల కోసం మరొకరిని దేహి అనాల్సిన పరిస్థితి ఉండదన్నారు. కావున వక్స్ ఆస్తులరక్షణకై భూములు కాపాడుకోవడానికై ఆవాజ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వక్స్ చట్టాలపై అవగాహన కల్పించడం కోసం రాష్ట్ర సదస్సు జరుగుతుందన్నారు . ఈ సదస్సులో వక్స్ చట్టాలలో ప్రావీణ్యం ఉన్న వక్తలు పాల్గొంటారని, కావున వక్స్ ఆస్తులను, భూములను రక్షించుకోవడానికై దర్గా ఈద్గా, పీర్ల సావడి, మదరసా, మజీద్ తదితర వక్స్ భూములను అనుభవిస్తున్న వారసులు వక్స్ భూముల రక్షణ కోరుకునే వారందరూ ఈ సదస్సులో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు.

➡️