ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : విజయవాడ బందరు రోడ్డులోని ఎంబివికెలో ఈ నెల 20న రాష్ట్ర స్ధాయి ఆరోగ్య సదస్సు ప్రజారోగ్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎంవి రమణయ్య అధ్యక్షతన నిర్వహించనున్నట్లు ప్రజారోగ్యవేదిక గౌరవాధ్యక్షులు కెవిఎస్ సాయి ప్రసాద్ తెలిపారు. విజయవాడ బాలోత్సవభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 20న జరిగే సదస్సులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ జి.సమరం, ఐఎం మాజీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వి.రాంప్రసాద్, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎ.పూర్ణానంద్, ప్రముఖ వాస్య్కులర్ సర్జన్ డాక్టర్ మాకినేని కిరణ్, ప్రజారోగ్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.కామేశ్వరరావు, జన విజ్ణాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్రా రామారావు హాజరవుతారన్నారు. ఎన్‌టిఆర్ జిల్లా ప్రజారోగ్యవేదిక జి.విజరుప్రకాష్ మాట్లాడుతూ సదస్సులో మేథావులు, సామాజిక సంస్థల ప్రతినిధులు, వైద్యారోగ్యరంగ ఉద్యోగులు, మెడికల్, పారా మెడికల్ విద్యార్ధులు అత్యధిక సంఖ్యలో హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎంబి విజ్ఞాన కేంద్రం బాధ్యులు బి.రవికుమార్ పాల్గొన్నారు.
