దగాకోరు బడ్జెట్ పై రాష్ట్ర వ్యాప్త నిరసనలు

Feb 5,2025 13:43 #cpm protest, #Union Budget 2025

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ను వ్యతిరికించండి : సిపిఎం, ప్రజా సంఘాలు 
ప్రజాశక్తి-యంత్రాంగం : కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక పేదలను దగా చేసే బడ్జెట్ ను వ్యతిరికించాలని సిపిఎం శ్రేణులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎంతో పాటు ఆంధ్రప్రదేశ్ రైతు, వ్యవసాయ, కౌలు రైతు సంఘాల నిరసన తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వవం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను దగా చేసేదిగా ఉందని, ప్రజా సంఘాల నాయకులు విమర్శించారు. బుధవారం పలు ప్రభుత్వ ఆఫీసులు, కూడళ్ళ వద్ద బడ్జెట్ ప్రతులను దగ్ధం చేసి, నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి భారీగా కోతలు విధించారని, దీని వలన వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉందని అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థకు భారీగా నిధులు తగ్గించడం అన్యాయమన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించడంలోనూ, సబ్సిడీ ఇవ్వడంలోనూ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. అదేవిధంగా పేదలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు భారీగా కోతలు విధించడం అన్యాయమని అన్నారు. కార్పొరేట్లకు ఊడిగం చేసే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టారే తప్ప, ఏ రంగానికి, అభివృద్ధికి నిధులు బడ్జెట్లో కేటాయించలేదని విమర్శించారు. విభజన మీ అమలు చేయడంలో వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు, పోలవరం నిర్వాసితులకు మొండి చేయి చూపించారని అన్నారు. రాష్ట్ర రాజధానికి నిధులు కేటాయించకుండా మరో మారు రాష్ట్రాన్ని మోసం చేశారని అన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 42 రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి పెట్టుబడిదారులకు ఊడిగం చేసే నాలుగు కోడ్ లు తెచ్చిందని అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయని అన్నారు.

గుంటూరు జిల్లా : కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ల బడ్జెట్ లా ఉందని ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె వి వి ప్రసాద్ విమర్శించారు. బుధవారం మంగళగిరి పట్టణంలోని పాత బస్టాండ్ కోడలి వద్ద బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లా : దేశంలో లేబర్ కోడ్ లు రద్దు చేసి కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని సిఐటియు నాయకులు జవ్వాది శ్రీనివాసరావు, దిగుపాటి రాజగోపాల్ లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. బుధవారం దేశావ్యాప్త పిలుపులో భాగంగా సంఘ కార్యాలయం నుండి గాంధీ బొమ్మల సెంటర్ వరకు కార్మిక ర్యాలీ నిర్వహించి ధర్నా చేసారు.

అనంతపురం జిల్లా : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతులను రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఉరవకొండ తాసిల్దార్ కార్యాలయం ఎదుట దగ్ధం చేశారు.

ప్రకాశం జిల్లా : లేబర్ కోడ్స్ రద్దుచేయాలని, కార్మిక ప్రజావ్యతిరేక కేంద్ర బడ్జెట్ కి నిరసనగా పొదిలిలో ప్రదర్శన,అనంతరం తహశీల్దార్ ఆఫీస్ ధర్నా

మన్యం జిల్లాలో…

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మొండి చెయ్యి చూపిందని ఆగ్రహం వ్యక్తం చేస్తు ప్రజా సంఘాలు అద్వర్యంలో బుధవారం దేవరాపల్లి లో పెద్ద ఎత్తున ఆందోళన

గుంటూరు జిల్లా

 

శ్రీకాకుళం జిల్లా …

కార్మికులకు నష్టదాయకమైన నాలుగు లేబర్ కోడ్ రద్దు చేయాలని అచ్యుతాపురంలో నిరసన

 

ఎన్టీఆర్ జిల్లా – నందిగామ : నిరసన కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఎర్ర శ్రీనివాసరావు, చెరుకుమల్లి పిచ్చియ్య, కౌలు రైతు సంఘం నాయకులు గుమ్మల్ల ఏడుకొండలు, సిఐటియు నాయకులు కర్రి వెంకటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సయ్యద్ ఖాసిం, మున్సిపల్ కార్మికులు చలికేటి నరేష్, తదితరులు పాల్గొన్నారు.

➡️