- ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ
ప్రజాశక్తి -ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో పూర్తిస్థాయి ఉత్పత్తి చేసేందుకు వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి 1451వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో స్టీల్‌ప్లాంట్‌లోని పలు విభాగాలకు చెందిన ఐఎన్‌టియుసి కార్మికులు కూర్చున్నారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ నాయకులు ఎం. రాజశేఖర్, నీరుకొండ రామచంద్రరావు మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్ భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మారుస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్మికులకు ఈ నెల కూడా 30 శాతం జీతాలే వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే స్టీల్‌ప్లాంట్ కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతాయన్నారు. కార్మికుల పరిస్థితిని అర్థం చేసుకొని వెంటనే పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.