పరిక్షలకు హాల్‌ టికెట్ల జారీలో విద్యార్థులను వేధిస్తే కఠిన చర్యలు

  • ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యులు సీతారాం

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : ఈనెల 17 నుండి రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న పదో తరగతి పరీక్షలు జరగుతుఉన్నాయనిఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యులు సీతారాం తెలిపారు. పరిక్షలకు హాల్‌ టికెట్ల జారీలో ఫీజులు పెండింగ్‌లో ఉన్నాయన్న నేపంతో పలు ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులు అందయని తెలిపారు. విద్యార్థులను వేదిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిక్షల సమయంలో స్కూల్‌ యాజమాన్యాలు ఫీజులుపై ఈ సమయంలో ఒత్తిడిని పెంచడం సమంజసం కాదని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలు సూచనలు జరీచేసిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్‌ లో హాల్‌ టికెట్ల జారీ ప్రక్రియ మొదలు పెట్టిందన్నారు. ఈ హాల్‌ టికెట్లతో నేరుగా జిల్లాలోని విద్యార్థులు నిరభ్యంతరంగా పరీక్ష కేంద్రాల్లో పరీక్షలక హాజరు కావచ్చాన్నారు. ఈ విషయంలో వారి తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలని సూచించారు. అలాగే ప్రభుత్వం ఆన్లైన్‌ హల్‌ టికెట్ల జారీపై తమ కమిషన్‌ చైర్‌పర్సన్‌ కేసలి.అప్పారావు నేతృత్వంలో అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు వివిధ రూపాల్లో అవగాహనా కార్యక్రమాలు, ప్రచార, ప్రసార సాధనాలు ద్వారా విస్తృత పరచాలని ఆదేశాలు జారీచేసినట్టు తెలిపారు. ఇంకా ఈ హాల్‌ టికెట్ల జారీ పేరుతో యాజమాన్యాలు గందరగోళ పరిస్థితులు సష్టిస్తే తమ కమిషన్‌ చట్ట ప్రకార చర్యలతో పాటు ఆయా యాజమాన్యాలపై క్రిమినల్‌ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వానికి, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులకు వివిధ సిఫారసులు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీతారాం చెప్పారు. సమస్యలుంటే aజూరషజూషతీ2018ఏస్త్రఎaఱశ్రీ.షశీఎ ఫిర్యాదులు చేయవచ్చని సీతారాం చెప్పారు.

➡️