మంత్రి సవితకు ఎమ్మెల్సీ కెఎస్ వినతి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పనిచేస్తున్న మహాత్మ జ్యోతిరావు ఫూలే బిసి స్టడీ సర్కిళ్లను పటిష్టపరచాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు కోరారు. బిసి సంక్షేమశాఖ మంత్రి ఎస్ సవితను సచివాలయంలో సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. సివిల్స్ సహా అన్ని పోటీ పరీక్షలకు సంబంధించి నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వాలని కోరారు. స్టడీ సర్కిళ్లకు శాశ్వత భవనాలు నిర్మించాలని కోరారు.
