కృష్ణా నదిలో పడి విద్యార్థి మృతి

Feb 12,2024 15:46 #Deaths, #krishna rivear

ప్రజాశక్తి-పల్నాడు : పల్నాడు జిల్లా అచ్చంపేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కృష్ణానదిలో మునిగి పదో తరగతి విద్యార్థి మృతి చెందారు. ఈ ఘటన పల్నాడు జిల్లాలోని చామరు రీచ్‌ చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అచ్చంపేటకు చెందిన బత్తుల గణేష్‌.. వేల్పూరు గ్రామం జడ్పిపిహెచ్‌ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. శనివారం సాయంత్రం ద్విచక్ర వాహనం తీసుకొని ఇంటి నుండి వెళ్లి తిరిగి రాకపోవడంతో పోలీసులకు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. గాలింపు చర్యలు చేపట్టగా సోమవారం ఉదయం విద్యార్థి మృతదేహం లభ్యం అయినట్లు తెలిపారు. గణేష్‌ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

➡️