ఉప్పల్‌ స్టేడియం వద్ద విద్యార్థి సంఘాల నిరసన

హైదరాబాద్‌: ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ టికెట్ల బ్లాక్‌ దందాకు పాల్పడుతున్నారని, దానికి అడ్డుకట్ట వేయాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఇదే విషయమై హెచ్‌సీఏ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జగన్మోహన్‌రావుకు వినతి పత్రం ఇచ్చేందుకు ఏఐవైఎఫ్‌, పీఎల్‌వై విద్యార్థి సంఘాల నాయకులు ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియానికి వచ్చారు.
అయితే వారిని స్టేడియం భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు సిబ్బందిని తోసుకుని లోపలికి వెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. విద్యార్థులు స్టేడియం వద్ద ధర్నా చేశారు. బ్లాక్‌ దందా నేపథ్యంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యంపై ఫిర్యాదు చేయడానికి వచ్చినట్లు తెలుస్తున్నది.

➡️