విద్యార్ధులకు నాసిరకం భోజనం పెడతారా?

Aug 31,2024 22:34 #Araku, #food pioson, #ill, #student
  • కలుషిత ఆహార ఘటనపై కలెక్టర్‌ సీరియస్‌

ప్రజాశక్తి – డుంబ్రిగుడ, అరకులోయ (అల్లూరి జిల్లా) : ‘వారంతా పిల్లలనుకుంటున్నారా ? పశువులనుకుంటున్నారా ?. మీ పిల్లలకైతే ఇలాగే నాసిరకం భోజనం పెడతారా ? అంటూ అల్లూరి జిల్లా డుంబ్రిగుడ మండలంలోని జాంగుడ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, మేట్రిన్‌, డిడిలను జిల్లా కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ ప్రశ్నించారు. శనివారం ఉదయం పిల్లలకు వండిపెట్టిన పులిహోర నాసిరకంగా ఉండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అరకు ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులందరూ కోలుకుంటున్నారని మీడియాకు ఆయన తెలిపారు. అస్వస్థతకు గురైన 61 మంది విద్యార్థులను ఏరియా ఆస్పత్రికి తరలించామని, మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట జాయింట్‌ కలెక్టర్‌ ఎంజె.అభిషేక్‌ గౌడ్‌, గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు కొండలరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జమాల్‌ బాషా ఉన్నారు.

➡️