- ఎమ్మెల్సీ ఎన్నికలపై చంద్రబాబు సమీక్ష
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రతి ఎన్నికలోనూ కూటమి విజయం సాధించాలని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ నెల 27న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించేలా నాయకులంతా సమిష్టిగా పనిచేయాలని చెప్పారు. ఉమ్మడి గుంటూరు-కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలతో ఆదివారం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. మూడు పార్టీల అభ్యర్థులు కలిసికట్టుగా పనిచేయాలని, ఎన్నికలకు 10 రోజులే సమయం ఉన్నందున క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించకుండా విజయం కోసం పనిచేయాలని చెప్పారు. బ్రాండ్ ఎపితో పెట్టుబడులు సాధించి యువతకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.