తొక్కిసలాట ఘటనలో ఉన్నతాధికారులకు సమన్లు

Mar 13,2025 18:46 #Stampede, #temple stampede, #Tirupati

ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కోసం జనవరి ఎనిమిదిన తిరుపతి బైరాగిపట్టెడ, శ్రీనివాసం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై మూడో దశ విచారణను చేపట్టారు. ఇందులో భాగంగా ఉన్నతాధికారులకు గురువారం సమన్లు జారీ చేశారు. ఈ నెల 17న విచారణకు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, టిటిడి ఇఒ శ్యామలరావు, ఎస్‌పి హర్షవర్ధన్‌రాజు హాజరు కావాలని పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనలో ఆరుగురు యాత్రికులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అప్పట్లోనే న్యాయ విచారణ జరిపిస్తామని సిఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ మేరకు జస్టిస్‌ సత్యనారాయణమూర్తిని కమిషన్‌ ఛైర్మన్‌గా నియమించారు. మొదటి విడత విచారణలో విష్ణునివాసం, బైరాగిపట్టెడ వద్ద విచారణ చేపట్టారు. ఘటనా స్థలి వద్ద ఉన్న బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండో విడతలో కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బాధితులను విచారించారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఒక్కసారిగా గేటు తీయడం వల్లనే ఈ తొక్కిసలాట చోటు చేసుకుందని కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లారు. మూడో విడత విచారణలో భాగంగా ఉన్నతాధిóకారులకు సమన్లు జారీ చేశారు.

➡️