గీతన్నల కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటిస్తేనే మద్దతు

Mar 9,2024 13:06 #demands, #geetha karmikula
  •  విస్మరించిన రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతాం
     కులాలవారీగా కార్పొరేషన్లు పెట్టి కల్లుగీతను నాశనం చేసిన వైసిపి ప్రభుత్వం
     గీత కార్మికులను ఓటు బ్యాంకు గా చూడడమే తప్ప అభివృద్ధి శూన్యం
     ఎక్స్గ్రేషియా రూ. 10 లక్షలు, పింఛన్ రూ..5 వేలకు పెంచాలి
     కళ్ళు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి

ప్రజాశక్తి-భీమవరం : రానున్న సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడనున్న నేపథ్యంలో లక్షలాది మంది గీతల కుటుంబాలను అన్ని విధాల  ఆదుకుంటామని ప్రకటించిన రాజకీయ పార్టీలకే తమ మద్దతు ఉంటుందని ఏపీ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహామూర్తి స్పష్టం చేశారు. కల్లుగీత కార్మికులను విస్మరించిన రాజకీయ పార్టీలకు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.పథకాల పేరుతో ఎల్లకాలం మోసం చేయలేరని, ప్రభుత్వానికి, గీత కార్మికులకు మధ్య వారధిలా పనిచేయడానికి, సంక్షేమ పథకాలు అమలు కోసం పోరాడి సాధించుకున్న కల్లుగీత కార్పోరేషన్ ను పునరుద్ధరిస్తామని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలో పెట్టాలని డిమాండ్ చేశారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో ఏపి కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం విలేఖర్ల సమావేశం నిర్వహిచారు. ఈ సందర్భంగా సంఘం ముఖ్య నాయకులు కడలి పాండులతో కలిసి జుత్తిగ నరసింహామూర్తి మాట్లాడరు. వృత్తుల వారీగా కార్పొరేషన్లు, ఫెడరేషన్లు ఉమ్మడి రాష్ట్రం నుంచే ఉన్నాయని, వాటిని కాదని వైసీపీ ప్రభుత్వం కులాల వారీగా కార్పొరేషన్లు పెట్టి కల్లుగీతను సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. స్వాతంత్రానికి ముందే కల్లుగీత ఇతర వృత్తులు ఉన్నాయని తెలిపారు. ఆనాడు వృత్తుల వారిగానే కులాలు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. ఈ విషయాన్ని అధికార, ప్రతిపక్ష పార్టీలు గుర్తించాలన్నారు. ఎంతో చరిత్ర ఉన్న లక్షలాది మంది గీత కార్మికులకు స్వయం ఉపాధి కల్పిస్తున్న కల్లుగీతను రాష్ట్రంలో గత తెలుగుదేశం, ప్రస్తుత అధికార వైసీపీ గాలికి వదిలేయడం బాధాకరమన్నారు. హక్కు లేకుండా చేసి, గీత వృత్తినే లేకుండా అధోగతి పాలు చేశాయని మండిపడ్డారు. పార్టీలు కిస్తీలు రద్దు చేసి తాటి, ఈత చెట్లపై దియబెట్టా పోరాడి సాధించుకున్న ఎక్స్రేషియో కు ఎగనామం పెట్టిన ఘనత చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిలకే దక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార వైసిపి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల వైఖరి గీత కార్మికుల పట్ల ఒకటైనని కేవలం అధికారం కోసం మాత్రమే వారి పోరాటమని ఎద్దేవా చేశారు. కల్లుగీత కార్మికులను కేవలం ఓటు బ్యాంకు గానే చూస్తున్నారు తప్ప అభివృద్ధి చేయడానికి మాత్రం నోచుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో లక్షలాదిమంది గీత కార్మికుల కుటుంబాలను పథకాల పేరుతో ఎల్లకాలం మోసం చేయలేరన్నారు. గీత కార్మికుల పట్ల జగన్ కి చిత్తశుద్ది ఉంటే గతంలో ఉన్న వృత్తుల వారి కార్పొరేషన్లు, ఫెడరేషన్లు తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు వాగ్దానాల వర్షం కురిపించి గీతకార్మికులను ఇతర వృత్తిదారులను మోసగిస్తే సహించేది లేదన్నారు. ఎక్స్రేషియా రూ. 10 లక్షలు, పెన్షన్ ను రూ. 5 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. కల్లుగీత సొసైటీలకు 40 శాతం బ్రాందీ షాపులు ఇవ్వాలని, కల్లుగీత వృత్తికి రక్షణ కల్పించి, వృత్తి ఆధునీకరణ చేసి, సంక్షేమ సామాజిక భద్రత నీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమలను నెలకొల్పాలని డిమాండ్ చేశారు. రాజకీయపార్టీలు ఎన్నికల ప్రణాళికలో కార్మికుల డిమాండ్లను పొందుపరచి పరిష్కరిస్తామని గీత కార్మికులను అన్ని విధాల ఆదుకుంటామని ప్రకటించిన వారికే మా మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. గీత కార్మికులను నిర్లక్ష్యం చేస్తే చూస్తూ ఊరుకోమని పోరాటాలను మరింత వదృతం చేస్తామని హెచ్చరించారు.

➡️