ప్రజాశక్తి-అమరావతి: తప్పుడు కేసులో ముంబయి సినీ నటి కాదంబరీ జత్వానీని అరెస్టు చేసి, ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో ఏపీలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్‌ను ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా తాతా ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని సస్పెన్షన్‌ను సెప్టెంబరు 25 వరకు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ముగ్గురూ అఖిలభారత సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారన్న అభియోగాలపై రివ్యూ కమిటీ సిఫారసు తర్వాత ఐపీఎస్‌ల సస్పెన్షన్ పొడిగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
