39 మంది సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు

Oct 27,2024 08:26 #police, #Suspension, #Telangana
  • టీజీఎస్పీ బెటాలియన్లలో నిరసనలను ప్రేరేపించారంటూ పోలీసు శాఖ ఉత్తర్వులు 

హైదరాబాద్‌ : తెలంగాణ పోలీస్‌ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. డిపార్ట్‌మెంట్‌లో ఆందోళనలను ప్రేరేపిస్తున్న వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు మొత్తం 39 మంది తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ సిబ్బందిపై ఆర్టికల్‌ 311 మేరకు సస్పెన్షన్‌ వేటు వేసింది. 3,4,5,17వ బెటాలియన్లలో ఆరుగురు చొప్పున, 6,12, 13వ బెటాలియన్లలో ఐదురుగు చొప్పున సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. పోలీస్‌ ఉద్యోగంలో ఉండి ధర్నాలు, ఆందోళనలకు నాయకత్వం వహించారని.. నిరసనలను ప్రేరేపించి క్రమశిక్షణను ఉల్లంఘించారని అందుకే సిబ్బందిపై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసినట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొంది.

➡️