వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే సిద్దారెడ్డి సస్పెన్షన్‌..

ప్రజాశక్తి-అమరావతి : ఎన్నికల్లో పార్టీలోనే ఉంటూ పార్టీ సిద్ధాంతాలకు వ్యతికేరంగా పని చేసిన నేతలపై జగన్‌ చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలోనే శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సిద్దారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లుగా తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాయలం ఉత్తర్వులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో సిద్దారెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు పెద్ద ఎత్తున రావడంతో అధినేత జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి.

➡️