ప్రజాశక్తి-మద్దిపాడు (ప్రకాశం జిల్లా) : ప్రకాశం జిల్లా మద్దిపాడు తహశీల్దార్ కార్యాలయంలో ఎసిబి సోదాలు కలకలం రేపాయి. డెత్ సర్టిఫికెట్ మంజూరు కోసం రూ.90 వేలు లంచం డిమాండ్ చేసిన నేపథ్యంలో విఆర్‌ఒ, తహశీల్దార్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎసిబి అధికారుల కథనం ప్రకారం..దొడ్డవరం గ్రామానికి చెందిన అంకమ్మరావు అనే వ్యక్తి భార్య ఇటీవల చనిపోయారు. డెత్ సర్టిఫికెట్ కోసం తహశీల్దార్ కార్యాలయంలో సంప్రదించగా విఆర్‌ఒ అంకమ్మరావు, తహశీల్దార్ సుజన్‌కుమార్ రూ.90 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించారు. రూ.90 వేల నగదును విఆర్‌ఒకు అంకమ్మరావు ఇస్తుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. తహశీల్దార్ లంచం తీసుకోవాలని చెప్పడంతో తాను తీసుకున్నానని విఆర్‌ఒ చెప్పడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
