ఎబి వెంకటేశ్వరరావు, ఠాకూర్‌పై చర్యలు తీసుకోండి

May 13,2024 22:45 #Take action, #Thakur, #Venkateswara Rao

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :సీనియర్‌ ఐపిఎస్‌ అధికారి ఎబి వెంకటేశ్వరరావు, మాజీ డిజిపి ఆర్‌పి ఠాకూర్‌లపై చర్యలు తీసుకోవాలని వైసిపి డిమాండ్‌ చేసింది.ఈ మేరకు వైసిపి ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసిపి లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్‌రెడ్డిలు సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో చాలా మంది ఐపిఎస్‌ అధికారులకు, డిఎస్‌పిలకు, సిఐలకు ఫోన్‌లు చేసి తెలుగుదేశం పార్టీకి సహకరించకపోతే ఇబ్బందులు పడతారని ఈ ఫిర్యాదులో వారు పేర్కొన్నారు.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

➡️