ఎమ్మెల్యే కొలికిపూడిపై చర్యలు తీసుకోండి

  •  ముఖ్యమంత్రికి ఎపిడబ్ల్యుజెఎఫ్‌ ఫిర్యాదు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఇళ్ల మీదికి వచ్చి బౌతిక దాడులకు పాల్పడితే మీకు దిక్కెవరని జర్నలిస్ట్‌లపై బహిరంగంగా బెదిరింపులకు పాల్పడుతున్న తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శనివారం తిరువూరు జర్నలిస్ట్‌లతో కలిసి ఎపిడబ్ల్యుజెఎఫ్‌ మంగళగిరిలోని ఎన్‌టిఆర్‌ భవన్‌లో టిడిపి జాతీయ అధ్యక్షులు, సిఎం నారా చంద్రబాబునాయుడుకు, రాష్ట్ర అధ్యక్షలు పల్లా శ్రీనివాసరావు కు ఫెడరేషన్‌ నాయకులు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఎపిడబ్ల్యు జెఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు ఎస్‌ వెంకట్రావ్‌, జి ఆంజనేయులు తిరువూరులో కొలికపూడి శ్రీనివాసరావు దౌర్జన్యాలను వివరించారు. జర్నలిస్ట్‌ల అనుచితంగా ప్రవర్తించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. తిరువూరులో ఏమి జరుగుతుందో తమ దృష్టికి వచ్చిందని ఆయనపై తగిన చర్యలను తీసుకుంటామని సిఎం చంద్రబాబునాయుడు, పల్లా శ్రీనివాసరావులు ఈ సందర్భంగా ఎపిడబ్ల్యు జెఎఫ్‌ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎపిడబ్ల్యుజెఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి గోరంట్లప్ప, ఎన్‌టిఆర్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కలిమిశ్రీ, ఎమ్‌బి నాథన్‌, జిల్లా నాయకులు రాఘవులు, ఎంవి నారాయణ, బద్రి, బి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️