తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సోదరుడు శంకర్‌ యాదవ్‌ మృతి

అమరావతి : మోండా మార్కెట్‌ వ్యాపారుల సంఘం అధ్యక్షులు, మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఇంట్లో విషాదం నెలకొంది. తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సోదరుడు తలసాని శంకర్‌ యాదవ్‌ సోమవారం ఉదయం మృతి చెందారు. శంకర్‌ యాదవ్‌ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సికింద్రాబాద్‌ లోని యశోద హాస్పిటల్‌ లో చికిత్స పొందుతూ ఆరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సోదరుడు, తలసాని శంకర్‌ యాదవ్‌ మరణం పట్ల బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు కెసిఆర్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బోయిన్‌ పల్లి మార్కెట్‌ అధ్యక్షుడిగా శంకర్‌ యాదవ్‌ కూడా పని చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, బంధువులు, స్నేహితులు ఆయనను పరామర్శిస్తున్నారు. తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ బిఆర్‌ఎస్‌ పార్టీలో కీలక నేత. సనత్‌ నగర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో బిఆర్‌ఏ పార్టీలో రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. 2014లో కెసిఆర్‌ తొలి మంత్రివర్గంలో పశుసంవర్ధక, మత్స్యశాఖ, డెయిరీ డెవలప్‌మెంట్‌, సినిమాటోగ్రఫీ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. రెండో మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు. శ్రీనివాస్‌ యాదవ్‌ స్వర్ణను వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు తలసాని సాయి కిరణ్‌ యాదవ్‌, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గతంలో బోయిన్‌ పల్లి మార్కెట్‌ అధ్యక్షుడిగా తలసాని శంకర్‌ యాదవ్‌ పనిచేశారు.

➡️