జనసేన నుంచి తమ్మయ్య బాబు సస్పెన్షన్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జి వరుపుల తమ్మయ్య బాబును పార్టీ నుంచి సప్పెండ్‌ చేస్తున్నట్లు ఆ పార్టీ పేర్కొంది. ఈ మేరకు పార్టీ కాన్ప్లిక్ట్‌ హెడ్‌ వేములపాటి అజయ్ కుమార్‌ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ప్రత్తిపాడు సిహెచ్‌సి ఘటనపై అందిన నివేదికలు, వివరణలు పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న ప్రత్తిపాడు సిహెచ్‌సి వైద్యులు శ్వేత పట్ల అనుచితంగా ప్రవర్తించి, దుర్భాషలాడిన ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు.

➡️