తాటాకు ఇల్లు దగ్ధం

Nov 1,2024 15:32 #house

ప్రజాశక్తి – పెద్దాపురం : పెద్దాపురం స్థానిక వీర్రాజుపేటలో దీపావళి రోజున జరిగిన అగ్ని ప్రమాదంలో మాడా మల్లికార్జున రావు కు చెందిన తాటాకు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానిక అగ్నిమాపక కేంద్రం అధికారి శ్రీహరి జగన్నాథ్ ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. ఈ ప్రమాదం వల్ల ఇంటిలోని అన్ని వస్తువులు దగ్ధమై కుటుంబం అంతా నిరాశ్రయులుగా మిగిలిపోయారు. స్థానిక వ్యాపారపుంత వీధికి చెందిన టిడిపి నాయకులు ఉల్లి సత్యనారాయణ నిరాశ్రయులైన మల్లికార్జున రావు కుటుంబానికి తక్షణసాయంగా నిత్యావసర సరుకులు అంద చేశారు.

➡️