ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఇ-ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసిన, నమోదు చేసిన వాహనాలకు ఐదేళ్లపాటు ప్రభుత్వం పన్ను మినహాయింపునిచ్చింది. ఈ మేరకు శుక్రవారం జిఓ ఎంఎస్ నెంబరు ఒకటిని విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0 (2024-29) ప్రకారం.. అన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి మోటారు వాహనాల పన్ను చెల్లింపు నుంచి 100 శాతం మినహాయింపునివ్వడం ద్వారా ప్రభుత్వం ప్రోత్సాహకం అందించినట్లవుతుంది.