వారణాసి చేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబు

May 14,2024 12:10 #chandrababu, #Varanasi

వారణాసి: టిడిపి అధినేత చంద్రబాబు వారణాసి చేరుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గననున్నారు. వారణాసిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే 400 సీట్లు సాధించబోతోందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 2047కు వికసిత భారత్‌ లక్ష్యంగా మోడీ పనిచేస్తున్నారని చెప్పారు. ప్రపంచంలోనే మన దేశం కీలకపాత్ర పోషించనుందన్నారు.
మరోవైపు మోడీ నామినేషన్‌కు పలు రాష్ట్రాల బిజెపి ముఖ్యమంత్రులు, ఎన్డీయే మిత్రపక్షాల నేతలు ఇప్పటికే వారణాసికి చేరుకున్నారు. మోడీ నామినేషన్‌ అనంతరం జరిగే ఎన్డీయే సమావేంలోనూ చంద్రబాబు పాల్గనే అవకాశముంది. నామినేషన్‌ వేయనున్న నేపథ్యంలో వారణాసిలోని దశాశ్వమేధ్‌ ఘాట్‌లో ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

➡️