సిఎం భద్రతా సిబ్బంది విందుపై ఇసికి టిడిపి ఫిర్యాదు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : గుంటూరు నాగార్జున యూనివర్సిటీలోని ఎన్నికల స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద సిఎం సెక్యూరిటీ సిబ్బంది విందు చేసుకోవడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్‌ మీనాకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు కాపీని పార్టీ నేతలు సిఇఒకు అందజేశారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా సిద్ధం పోస్టర్‌తో వైసిపి డిజె పాటలతో పార్టీ నిర్వహించారని, ఈ పార్టీలో 450 మందికి పైగా పోలీసు అధికారులు పాల్గొన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ నిర్వహించిన సిఎం సెక్యూరిటీ గ్రూప్‌ ఎస్‌పి అత్తాడ బాపూజీపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు.

➡️