- సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ
ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : టిటిడి ఎస్‌వి గోశాలలోని దాణా కుంభకోణంపై విచారణ జరపాలని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ డిమాండ్ చేశారు. తిరుపతి టిటిడి గోశాలను ఆయన బుధవారం సందర్శించారు. తిరుమల పవిత్రతను, టిటిడి వ్యవస్థను కాపాడాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ఇలాంటి దేవాలయానికి చెడ్డ పేరు వస్తే నష్టం తిరుపతి ప్రజానీకానికేనని అన్నారు. దాణా కుంభకోణంలో అక్రమాలు జరిగితే ప్రభుత్వం కచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నారాయణ వెంట సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి, నాయకులు చినం పెంచలయ్య, విశ్వనాథ్ ఉన్నారు.