టిడిపి నేత బీటెక్‌ రవికి బెయిల్‌ మంజూరు

Nov 29,2023 17:05 #bail, #maareddy ravindrareddy

కడప: వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్‌ రవి)కి కడప జిల్లా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. నవంబరు 14 నుంచి కడప జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న రవి బుధవారం సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది. టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర ప్రారంభించడానికి రెండు రోజుల ముందు జనవరి 25న కడపలోని దేవుని కడప ఆలయం, పెద్ద దర్గా సందర్శనకు వచ్చారు. ఈ సందర్భంగా లోకేశ్‌కు స్వాగతం పలకడానికి పెద్దసంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బీటెక్‌ రవి కడప విమానాశ్రయం ముఖద్వారం వద్దకు చేరుకున్నారు. విమానాశ్రయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో ఆయనకు వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. దాదాపు పది నెలల తర్వాత వల్లూరు పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి బీటెక్‌ రవిని అరెస్టు చేశారు. ఈనేపథ్యంలో కడప జిల్లా కోర్టు బుధవారం బెయిల్‌ మంజూరు చేసింది.

➡️