కాంగ్రెస్‌లోకి టిడిపి నేత

Mar 31,2024 21:49 #join congress, #Tdp Leader

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :కర్నూలు జిల్లాకు చెందిన టిడిపి సీనియర్‌ నేత రామ్‌ పుల్లయ్య యాదవ్‌ ఆదివారం కాంగ్రెస్‌ పార్టీలో చేశారు. పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని ఆమె నివాసానికి చేరుకున్న ఆయన, చర్చల అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మరోవైపు వలంటీరు వ్యవస్థపై ఆంక్షలు విధించటాన్ని స్వాగతిస్తున్నట్లు ట్విట్టర్‌ వేదికగా షర్మిల తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వలంటీర్లను వైసిపి వాడుకుంటోందని అన్నారు. పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డితో ఆమె ఫోన్‌లో మాట్లాడారు. రెండు మూడు రోజుల్లో లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో పింఛన్ల పంపిణీ జరపాలని, దీని కోసం ఇతర ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించుకోవాలని సూచించారు. పింఛన్ల పంపిణీని ఆలస్యం చేస్తే సిఎస్‌ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని ఆమె పేర్కొన్నారు.

➡️