ప్రజాశక్తి- మాచర్ల : వైసిపి ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బొండా ఉమలపై మాచర్లలో దాడి చేసిన వైసీపీ నేత తురకా కిశోర్‌ను పల్నాడు పోలీసులు హైదరాబాదులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తురకా కిశోర్‌ను పోలీసులు నేడు మాచర్ల కోర్టులో హాజరుపరిచారు. తురకా కిశోర్ కు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దాంతో పోలీసులు కిశోర్‌ను గుంటూరు సబ్ జైలుకు తరలించారు. కాగా కిశోర్‌పై 7 హత్యాయత్నం కేసులు, మరో 7 ఇతర కేసులు ఉన్నాయి.
