ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోండి

Nov 29,2023 14:24 #Illegal, #Protest, #sand, #TDP
tdp protest against sand mining1

ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం : ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద పడవల రేవు వద్ద ఇసుక అక్రమ రవాణాను ఆపాలంటూ టిడిపి శ్రేణులు నిరసన తెలిపారు. అక్రమ రవాణా చేస్తున్నారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. ధర్నా చేస్తున్న ఉమామహేశ్వరరావు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ ఖజనాకు జమ కావలసిన వందల కోట్లు అధికార పార్టీ నేతల జేబుల్లోకి వెళ్లాయని విమర్శించారు. రాష్ట్రంలో సామాన్యుడికి ఇసుక అందుబాటులో లేదని మండిపడ్డారు. కాంట్రాక్టు కాలపరిమితి మేలోనే ముగిసిందని, అయినా ఆరు నెలలుగా అక్రమంగా ఇసుక తరలిస్తూనే ఉన్నారని ఆగ్రహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.

➡️